BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 11:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:25 PM
144 వీక్షణలు

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ

ఆగిరిపల్లి, మార్చి 25:

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప ఉన్నత ఆశయాలు కలిగిన నాయకుడని కొనియాడారు.

దేశంలో సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా సేవలందించిన జగ్జీవన్ రామ్ వ్యవసాయ, కార్మిక, రక్షణ శాఖల్లో కీలక పాత్ర పోషించి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడని గుర్తుచేశారు.

అంటరానితనం, అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నత పదవులను అధిరోహించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను వదులుకొని మెరిట్‌తో విద్యను కొనసాగించిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను వివరించారు.

డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన జగ్జీవన్ రామ్ ఆశాజ్యోతి అని కొనియాడారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే దళితులు ఉన్నత విద్య సాధించి, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత ప్రభుత్వం బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ, ఆర్థిక పథకాలు అమలు చేస్తున్నదని, వాటిని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. దళితులు వ్యాపార రంగంలో ఎదగడానికి బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు తనవంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఎస్‌సి సబ్‌ప్లాన్ అమలుకు తోడ్పడిన తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదని, దళితులు ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. త్వరలో కల్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

నియోజకవర్గంలో పేదలకు ఎలాంటి సమస్య వచ్చినా పెద్దపాలేరులా సేవలు అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.