BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 29 May 2026, 11:17 am
Posted by : NTODAY NEWS

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై GDAAP తీవ్ర ఖండన

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
29 May, 2026 - 11:17 AM
628 వీక్షణలు

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు వైద్య సిబ్బందిని సుమారు 10 గంటలపాటు నిర్బంధించి విచారించిన సంఘటనను గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (GDAAP) ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనిట్ తీవ్రంగా ఖండించింది. 

ఈ సందర్భంగా GDAAP ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనిట్ అధ్యక్షులు డా. కె. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిపై ఈ విధమైన వ్యవహారం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బందిని గంటల తరబడి నిర్బంధించి విచారించడం వల్ల ఆసుపత్రి సేవలకు అంతరాయం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య సిబ్బందికి తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డా. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. వైద్య వృత్తిని గౌరవిస్తూ, వైద్య సిబ్బందికి అనుకూల వాతావరణం కల్పించడం అత్యంత అవసరమని GDAAP నాయకులు పేర్కొన్నారు.