BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర: సాధారణ కుటుంబం నుంచి వైద్య విద్యలో సీటు....

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:29 PM
17 వీక్షణలు

మధిర: సాధారణ కుటుంబం నుంచి వైద్య విద్యలో సీటు.. పూజితకు పోలీసు అధికారుల అభినందనలు

పూజితకు అభినందనలు

సాధారణ కుటుంబం నుంచి ఎంబీబీఎస్‌లో సీటు.. పూజితకు అభినందనలు

మధిర: కృషి, పట్టుదలతో సాధారణ కుటుంబం నుంచి వైద్య విద్యలో సీటు సాధించిన పూజితను మధిర టౌన్ పోలీసు అధికారులు అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణ పోలీసు స్టేషన్‌లో కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న మడుపల్లి వాసి పి. మురళి పెద్ద కుమార్తె పూజిత సిద్ధిపేట వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. ఈ సందర్భంగా మధిర టౌన్ సీఐ రమేష్, ఎస్సై కిషోర్ ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

అతి సామాన్య కుటుంబం నుంచి కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. పూజిత తన కృషి, పట్టుదలను కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పూజిత సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీఐ రమేష్, ఎస్సై కిషోర్ పేర్కొన్నారు.