BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 September 2026, 04:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో లోపించిన పారిశుద్ధ్యం 13వ వార్డులో డ్రైనేజీ సమస్యతో ప్రజల అవస్థలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 04:00 PM
9 వీక్షణలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

మురుగునీరు నిలిచిపోవడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతోందని, పారిశుద్ధ్య సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్‌తో పాటు సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు సరైన స్పందన కనిపించలేదని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు.

వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచిపోతుందని తెలిపారు. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే స్పందించాలి

13వ వార్డులో నెలకొన్న పారిశుద్ధ్య, డ్రైనేజీ సమస్యలపై మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్ వెంటనే స్పందించి సంబంధిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.