BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 25 August 2026, 04:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:36 PM
203 వీక్షణలు

మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్

నూజివీడు, ఆగిరిపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో అఖిలభారత స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌డబ్ల్యూఎఫ్) మండల అధ్యక్షురాలు కలపాల రాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బక్కయ్య మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించలేదని, పారిశుధ్య కార్మికులు, ఆయాలకు ఆరు నెలలుగా వేతన బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు జూలై నెలలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, పాఠశాలల్లో సేవలందిస్తున్న కార్మికులకు మాత్రం జీతాలు, బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. నెలల తరబడి వేతనాలు అందక కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు.

కార్మికుల సమస్యలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగిరిపల్లి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆగస్టు 27న ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ కమిటీ సభ్యురాలు పల్లెపాము భవాని, కార్మికులు పాల్గొన్నారు.