BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 07 April 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మీడియా ముసుగులో బూతులు సిగ్గుచేటు.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:22 PM
339 వీక్షణలు

మీడియా ముసుగులో బూతులు సిగ్గుచేటు. బూతు కిట్టు అనేది రాధాకృష్ణకి సరైందే.మహిళల గురించి తప్పుడు కూతలు సరైందేనా?.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల భార్యల గురించి అసభ్యంగా ఏబిఎన్ ఛానల్ ప్రసారం చేసిన కధనం మహిళల పట్ల ఏబిఎన్ రాధాకృష్ణకి ఎంత చులకన భావం ఉందో అర్థం అవుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చాట్ల రాబర్ట్ అన్నారు. మీడియా ముసుగులో, అధికార పార్టీ అండదండలతో ఏబిఎన్ ఛానల్ లో నీచాతి నీచమైన కథలు, కధనాలు ప్రసారం చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించే కధనాలను ఖండిచ వలసిన అధికార పార్టీ నేతలు బూతుల రాధాకృష్ణను సమర్దించటం సిగ్గు చేటు అన్నారు. మహిళలను చులకనగా మాట్లాడితే సహించేది లేదని పదేపదే నారా లోకేష్ అంటున్నారు కదా మరి ఏబిఎన్ కధనం లో మహిళల గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. గతంలో సాక్షి లో వచ్చిన ప్రసారంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు  ప్రమేయం లేకుండానే ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలకు కూటమి ప్రభుత్వం కొమ్మినేని ని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు కదా అప్పుడు ఉన్న ఉత్సాహం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు లేదా? పచ్చమీడియా ఎన్ని పచ్చి బూతులు ప్రసారం చేసినా సమర్దించటం తెలుగు తమ్ముళ్ళ కి సరైందేనా? అని ప్రశ్నించారు. మహిళలపై చులకనగా కధనాలు ప్రసారం చేసే ఏబిఎన్ రాధాకృష్ణ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.