BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 07:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహబూబాబాద్ మార్కెట్‌కు తాళం.. రైతుల ఆందోళన

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:06 PM
97 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతుల నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ కొనుగోలు చేసిన మిర్చి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. "మా డబ్బులు మాకు ఇప్పించాలి" అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ఎన్.ఎస్. ట్రేడర్స్ మార్కెట్ యార్డులోనే కాకుండా మార్కెట్ వెలుపల కూడా రైతుల నుంచి మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసి మూడు నెలలు గడిచినా ఇప్పటికీ చెల్లింపులు చేయలేదన్నారు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ తమను తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.