BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2026, 02:27 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

మహిళా మహిళల జోలికి వస్తే బూడిదైపోతావ్ వేలంపల్లి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
09 Apr, 2026 - 02:27 PM
114 వీక్షణలు
మహిళా మహిళల జోలికి వస్తే బూడిదైపోతావ్ వేలంపల్లి
విజయవాడ 

09-04-2026


రాధాకృష్ణ ఒక 'యెల్లో వైరస్' - వెలంపల్లి

మహిళల జోలికొస్తే బూడిదవుతావు - వెలంపల్లి

పత్రికా రంగం పేరుతో బ్రోకర్ రాజకీయాలు చేస్తూ,మహిళా లోకాన్ని కించపరుస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు.రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు,రాధాకృష్ణ బరితెగింపుపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెలంపల్లి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యంత కరుకుగా స్పందించారు.​"రాధాకృష్ణ ఒక పత్రికా యజమాని కాదు, నైతిక విలువలు లేని ఒక వికృత మనస్తత్వవాది.చంద్రబాబు చంకలో కూర్చుని,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలపై విషం కక్కడం రాధాకృష్ణకు నిత్యకృత్యమైంది.మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వార్తలు రాస్తున్న రాధాకృష్ణకు ఇంట్లో ఆడవాళ్లు లేరా? అని ప్రశ్నిస్తున్నాం.పత్రికా స్వేచ్ఛ అనేది నీ ఇంటి సొత్తు కాదు.నీవు రాసే రాతలు,చేసే కూతలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి.రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని మహిళల గౌరవంతో ఆడుకుంటే సహించేది లేదు,"అని వెలంపల్లి హెచ్చరించారు.​రాధాకృష్ణ లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని,ఇటువంటి 'నీచ బుద్ధి' ఉన్న వ్యక్తిని వెంటనే కటకటాల వెనక్కి నెట్టాలని ఆయన డిమాండ్ చేశారు."రాధాకృష్ణా నీ అరాచకాలను ఇకపై సాగనివ్వం. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను వీధి వీధినా తరిమి కొడతారు.పోలీసులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి రాధాకృష్ణను అరెస్ట్ చేయాలి.చట్టం తన పని తాను చేయకపోతే,మహిళా లోకం తిరగబడి బుద్ధి చెబుతుంది,"అని అత్యంత ఘాటుగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వెలంపల్లి   మాజి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొన్నా రు.