BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 18 August 2026, 02:02 pm
Posted by : NTODAY NEWS

మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
18 Aug, 2026 - 02:02 PM
63 వీక్షణలు

మహిళలు, బాలల భద్రతే ప్రధాన లక్ష్యం: ఆమడగూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు

ఆమడగూరు: మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమడగూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ తెలిపారు.

మహిళలు, బాలలపై జరుగుతున్న నేరాల నివారణ, వారి హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో కందుకూరుపల్లిలో సోమవారం మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పుట్టపర్తి డీఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, బాలలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.

ఎస్‌ఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు, బాలలపై జరుగుతున్న నేరాలు, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, POCSO చట్టం, మహిళలు మరియు బాలలకు సంబంధించిన వివిధ చట్టాలు, ఆత్మహత్యల నివారణ తదితర అంశాలను వివరించారు.

మహిళలు, బాలలు ఎలాంటి వేధింపులు, నేరాలు లేదా ఆన్‌లైన్ మోసాలకు గురైనప్పటికీ భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి చట్టపరమైన సహాయం పొందాలని తెలిపారు.

మహిళలు, బాలల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్‌ఐ గోపాలకృష్ణ అన్నారు. నేరాల నివారణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.