BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 10:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మిట్టల్‌కు వరాలు.. విశాఖ ఉక్కుకు నిర్లక్ష్యం?

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 10:49 PM
125 వీక్షణలు

మిట్టల్‌కు వరాలు.. విశాఖ ఉక్కుకు నిర్లక్ష్యం? – వైఎస్ షర్మిల ఫైర్

అమరావతి, మార్చి 25: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం చూపుతున్న ప్రోత్సాహం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పట్ల అవలంబిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వం మీద ఘాటు ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భారీగా రాయితీలు, సబ్సిడీలు అందిస్తున్నారని, సుమారు రూ.25 వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు ప్రకటించడం, రాష్ట్ర వాటా జీఎస్టీపై 15 సంవత్సరాల మినహాయింపులు ఇవ్వడం, విద్యుత్ చార్జీలలో యూనిట్‌కు రూ.1 వరకు సబ్సిడీ కల్పించడం వంటి నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.

అదే సమయంలో బైలడిల్లా నుంచి ఐరన్ ఓర్ కేటాయింపులు, రవాణా సదుపాయాలు, సొంత పోర్ట్, పైప్‌లైన్ అనుమతులు వంటి కీలక సౌకర్యాలను కూడా మిట్టల్ ప్రాజెక్ట్‌కు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడిసరుకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇక విశాఖ ఉక్కు కర్మాగారానికి నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాల్లో సరైన మద్దతు లభించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రైవేట్ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

దాదాపు 35 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది.