BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 June 2026, 01:50 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్‌లో ముమ్మరంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 01:50 PM
284 వీక్షణలు

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడమే లక్ష్యం: మేయర్ దర్ని మధుకర్

​సమస్యల పరిష్కారానికి అధికారుల సమీక్ష

​మంచిర్యాల, జూన్ 10: ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరవేయడమే లక్ష్యంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌లో బుధవారం వార్డు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు అధికారులను ఈ సభలో అందుబాటులో ఉంచామని, డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే డివిజన్ పరిధిలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, శాంతిభద్రతలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

​ఈ వార్డు సభా కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూర్జహాన్ బేగం, మంచిర్యాల ఎస్సై (SI) మజారుద్దీన్, అలాగే విద్యుత్, వ్యవసాయ, గృహ నిర్మాణ (హౌసింగ్ బోర్డు) శాఖల అధికారులు, డివిజన్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ పరిధిలోని పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు