BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 06:04 pm
Posted by : V శ్రీనివాస్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో వార్డు సభలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 06:04 PM
166 వీక్షణలు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం: మేయర్ దర్ని మధుకర్
99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల 31, 32వ డివిజన్లలో వార్డు సభ
మంచిర్యాల, జూన్ 8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31, 32వ డివిజన్లలో వార్డు సభలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు, మేయర్ దర్ని మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే డీసీపీ ఎగ్గడి భాస్కర్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, స్థానిక కార్పొరేటర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా వార్డు సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

వర్షాకాలం నేపథ్యంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చెత్త నిర్వహణలో ప్రజలు సహకరించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి బిల్లులు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిలిన అర్హులకు కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి సమస్యల పరిష్కారానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో 32వ డివిజన్‌లో ప్రాథమిక పాఠశాల, రాంనగర్–ఏఎస్‌ఆర్‌ఆర్ నగర్ కనెక్టివిటీ బ్రిడ్జి, నూతన రోడ్లు, ఆధునిక డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సంతోష్, హౌసింగ్ బోర్డు ఏఈలు ప్రశాంతి, సలోమి రాణి, నస్పూర్ ఎస్ఐ ప్రశాంత్, ఆర్ఐ చందర్, డాక్టర్ ప్రియాంక, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.