BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 10:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నా మాటలకు మా అమ్మను ఎందుకు శిక్షించారు?: కొండా సుష్మిత

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Sep, 2026 - 10:59 PM
4 వీక్షణలు

రాజకీయ నాయకురాలిగా కాదు.. ఒక కూతురిగా మాట్లాడుతున్నా: సుష్మిత

వరంగల్ | Ntoday News

తన తల్లి, మాజీ మంత్రి కొండా సురేఖకు ఎదురైన పరిణామాలపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి పడుతున్న బాధను ఒక కూతురిగా చూడలేకనే మాట్లాడుతున్నానని ఆమె తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమేనని సుష్మిత స్పష్టం చేశారు. తన తల్లి కొండా సురేఖ గానీ, తండ్రి గానీ తనను ఆ వ్యాఖ్యలు చేయమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యల్లో తప్పుంటే దానికి పూర్తి బాధ్యత తనదేనని, తనపై కేసులు పెట్టినా, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

“నా మాటలకు మా అమ్మను ఎందుకు శిక్షించారు? నా మాటలకు మా అమ్మకు ఏం సంబంధం?” అంటూ ఆమె ప్రశ్నించారు. తాను మాట్లాడిన విషయాలకు తన తల్లిదండ్రులను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నారు.

తన వ్యాఖ్యల కారణంగా తల్లి మంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి వస్తుందని తాను ఏమాత్రం ఊహించలేదన్నారు. ముందే ఆ విషయం తెలిసి ఉంటే తాను ఆ వ్యాఖ్యలు చేసేదాన్ని కాదని తెలిపారు. తనపై కేసులు నమోదవుతాయని, తనను ఇబ్బందులకు గురిచేస్తారని మాత్రమే భావించానని చెప్పారు.

“అమ్మ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు”

సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కొండా సురేఖ రాజకీయంగా ఎదిగారని సుష్మిత గుర్తుచేశారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కొనసాగించారని తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తన తల్లికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

ఇంతటి రాజకీయ అనుభవం ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. “నేను స్ట్రాంగ్ లేడీనే.. పిరికిదాన్ని కాదు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా కాదు.. ఒక కూతురిగా మాట్లాడుతున్నా” అంటూ సుష్మిత భావోద్వేగానికి గురయ్యారు.

మంత్రి పదవి కోల్పోవడం కంటే ఆ తర్వాత తన తల్లిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విమర్శలే తనను ఎక్కువగా బాధిస్తున్నాయని తెలిపారు. ఇతరులతో మాట్లాడిస్తూ తన తల్లిని మరింత అవమానించవద్దని కోరారు. కొండా సురేఖ స్థాయికి సరిపోని వ్యక్తులతో ఆమెపై విమర్శలు చేయించడం సరికాదని, తద్వారా ఆమె స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

తల్లిదండ్రుల ప్రమేయం లేదని స్పష్టం

తన వ్యాఖ్యలను కొండా సురేఖ కనీసం ఖండించలేదనే కారణంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారనే వాదనను సుష్మిత తప్పుబట్టారు. కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేయడం ఎలా సమంజసమని ప్రశ్నించారు.

తన తండ్రితో కూడా ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిపారు. తన వల్ల కుటుంబానికి ఇబ్బందులు వచ్చాయని చెప్పినప్పుడు ఆయన తనను తప్పుబట్టలేదని, “నీ తప్పేం లేదు” అంటూ ధైర్యం చెప్పారని వెల్లడించారు. రాజకీయ వ్యాఖ్యలు చేయాలని తన తల్లిదండ్రులు ఎప్పుడూ సూచించలేదని, తన పిల్లల సాక్షిగా చెబుతున్నానని సుష్మిత పేర్కొన్నారు.

తాను చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసినవి కావని, ఒక వ్యక్తి, ఆయన కుటుంబ వ్యవస్థపై మాత్రమే మాట్లాడానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై తాను ఎక్కడా విమర్శలు చేయలేదన్నారు. సోనియా గాంధీ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి కోసం తలవంచే పార్టీ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సుష్మిత.. పార్టీ సిద్ధాంతాలు, వ్యక్తుల మధ్య తేడాను గుర్తించాలని కోరారు.

“చర్య తీసుకోవాలంటే నాపైనే తీసుకోండి”

కాంగ్రెస్ హైకమాండ్ మొదట కొండా సురేఖ పట్ల సానుకూలంగానే ఉందని, తర్వాత జరిగిన పరిణామాలతో పరిస్థితి మారిందనే భావన తనకు కలిగిందని సుష్మిత అన్నారు. “ఆమె ఉండాలా.. నేను ఉండాలా?” అనే స్థాయికి పరిస్థితి వెళ్లిందనే భావన తనకు కలిగిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలనుకుంటే తనపైనే తీసుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. తల్లిని రాజకీయంగా శిక్షించడం తనకు అర్థం కావడం లేదన్నారు.

కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తర్వాత తీవ్రంగా కుంగిపోయినట్లు కనిపిస్తున్నారని, తల్లిని ఆ పరిస్థితిలో చూడటం ఒక కూతురిగా తన వల్ల కావడం లేదంటూ సుష్మిత కన్నీటి పర్యంతమయ్యారు.