BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 May 2026, 06:43 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 06:43 PM
172 వీక్షణలు

మంచిర్యాల పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అండాలమ్మ కాలనీ ఈద్గా మరియు బస్ స్టాండ్ కబ్రస్థాన్ దర్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్మి మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు (కార్పొరేటర్) తూముల నరేష్‌లతో పాటు పలువురు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ ధర్మి మధుకర్ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ శాంతి, సహనానికి ప్రతీక అని, అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని కోరారు. తూముల నరేష్ మాట్లాడుతూ.. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లిం సోదరులతో కలిసి పండుగ వాతావరణంలో పాలుపంచుకోవడం పట్టణంలో నెలకొన్న మత సామరస్య వాతావరణాన్ని ప్రతిబింబించింది