BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 18 May 2026, 05:36 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం అవగాహన కార్యక్రమాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 May, 2026 - 05:36 PM
134 వీక్షణలు

మంచిర్యాల జిల్లాలో ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు రెవెన్యూ డివిజన్ మంచిర్యాల్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రక్తపోటుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్.సి.డి డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారులు డాక్టర్ స్నేహిత, డాక్టర్ అశోక్ కలిసి రక్తపోటుపై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన అధికారులకు, ప్రజలకు రక్తపోటు లక్షణాలు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తపోటును “నిశ్శబ్ద శత్రువు”గా అభివర్ణించారు. ముందస్తుగా గుర్తించి జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చని తెలిపారు. సరైన సమయంలో, సరైన మోతాదులో మందులు వాడటం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, ఆర్.ఎస్. పద్మ, వసుమతి, మార్త లక్ష్మణ స్వామి, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గ్రామాలలో ప్రజలకు రక్తపోటుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులకు, ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపోటుకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు