BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

మండు వేసవిలో చల్లని కబురు..

తెలంగాణ
/ తెలంగాణ / హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 01:45 PM
71 వీక్షణలు

తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు

మండు వేసవిలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో వచ్చే ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈనెల 21 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం, బుధవారం నాటికి ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొంత తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పడిన ఈ వర్షాలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాయి.

ఎండలకు కాస్త బ్రేక్

ఈసారి తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండలు తీవ్రంగా మండడం ప్రారంభమైంది. మార్చి ప్రారంభానికి చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరుకున్నాయి.

ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు మండిపోతుండగా, మధ్యాహ్నం సమయాల్లో నగరాలు, పట్టణాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండగా రాత్రిపూట కూడా ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది.

ఇలాంటి సమయంలో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్టయింది.