BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 26 May 2026, 01:57 pm
Posted by : V శ్రీనివాస్

మంత్రి పొంగులేటి అహంకార వైఖరిని ఖండిస్తున్నాం: బీసీ సమాజ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 01:57 PM
209 వీక్షణలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ నాయకులకు అడుగడుగునా అవమానాలు


మంత్రి వాకిటి శ్రీహరి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి

బీసీల ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తాం: నరెడ్ల శ్రీనివాస్ హెచ్చరిక

​రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న బీసీ నాయకుడు, మంత్రి వాకిటి శ్రీహరిపై సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రదర్శించిన అహంకారపూరిత వైఖరిని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ప్రభుత్వంలో చోటుచేసుకున్న ఈ తాజా పరిణామాలే నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలోనే బీసీ నాయకులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని, పేరుకే బీసీ మంత్రులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలో ఆధిపత్య కులాల ప్రాబల్యమే కొనసాగుతోందని విమర్శించారు.

​దేశంలో, రాష్ట్రంలో 50 శాతానికి పైగా జనాభా కలిగిన బీసీ వర్గాలకు ఇప్పటికీ సరైన గౌరవం, రాజకీయ ప్రాధాన్యం దక్కకపోవడం బాధాకరమని నరెడ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరిపై జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు చొరవ తీసుకుని, బీసీ నాయకుడిని అవమానించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

​బీసీలను అంతర్గతంగా అవమానిస్తూ, అణగదొక్కే రాజకీయ ధోరణులను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నింటినీ త్వరలోనే ఏకం చేస్తామని, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాత్మక కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్ తరఫున ఆయన హెచ్చరించారు

​