BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 01 July 2026, 12:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మూడేళ్ల నిరీక్షణకు ముగింపు.. ఈసారి కచ్చితంగా హిట్ కొడతాం: అఖిల్ అక్కినేని ధీమా

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:02 PM
134 వీక్షణలు

అఖిల్ అక్కినేని నటించిన సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయ్యిందని, ఈ ఆలస్యానికి అభిమానులు క్షమించాలని కోరారు. అయితే ఈసారి మాత్రం తాను నటించిన లెనిన్ సినిమాతో తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి, అఖిల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం లెనిన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మంగళవారం విశాఖపట్నంలో ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అఖిల్.. "ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడను.. రిలీజ్ రోజు నా సినిమానే మాట్లాడుతుంది. రెండు రోజులుగా నిద్రపోలేదు. అయినా అభిమానులను చూసిన తర్వాత కొత్త ఎనర్జీ వచ్చింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. లెనిన్ మరో ఎత్తు. ఈసారి కచ్చితంగా హిట్ కొడుతున్నాం.. నమ్మండి" అంటూ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచారు.