BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 06:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మోడీ పాలనపై హరినాథ్ విమర్శలు, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఎలర్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:32 PM
309 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండల కేంద్రంలో ఇటీవల సీపీఐ ఎంఎల్ లిబరేషన్ సమావేశం నిర్వహించబడింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ ప్రసంగంలో మోడీ 12 సంవత్సరాల పాలనలో రికార్డు సాధించాడనే ప్రచారాన్ని ఖండించారు. నెహ్రూ, ఇందిరా రికార్డును మోడీ అధిగమించలేదని స్పష్టంగా తెలిపారు.

హరినాథ్ అన్నారు, దేశ సంపద నలుగురి చేతుల్లో బంధీ అయిందని, మోడీ–అమిత్ షా అమ్ముతున్నప్పుడు ఆదాని, అంబానీలు కొంటున్నారని. వీరు నలుగురూ గుజరాతీ వారేనని విశేషంగా పేర్కొన్నారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ దోచిన విధానం నేడు వెస్ట్ ఇండియా దోచుకునే పరిస్థితిగా మారిందని విమర్శించారు.

ప్రొఫెసర్ సాయిబాబా, స్టాన్ స్వామి వంటి హక్కుల ఉద్యమ నేతలను బెయిల్ ఇవ్వకుండా నిర్బంధించిన సంగతి, డేరా బాబా వంటి రేపిస్టులకు 4 పర్యాయములు ఫెరోలు ఇవ్వడం వంటి వివాదాలను హరినాథ్ కచ్చితంగా ఎద్దేవా చేశారు.

మోడీ ఫెడరల్ హక్కులను హరిస్తూ, రాష్ట్రాలను కుదించడమే లక్ష్యంగా ఉన్నారని, దీనికి చంద్రబాబు మోడీ భజన చేయటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అదేవిధంగా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకోవాలని మోడీ పరివార్ ప్రయత్నిస్తున్నారని, సనాతన ధర్మం పేరుతో మహిళల హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు 

హరినాథ్ మాట్లాడుతూ, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యమేలుతోందని, మోడీ హఠావోదేశ్ బచావో ఉద్యమాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏ సీసీటీయీ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య, జిల్లానాయకులు చాట్ల బాబురావు, కలపాల వెంకటేశ్వరరావు, భవాని తదితరులు పాల్గొన్నారు.