BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 05:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మర్లపాలెం గ్రామంలో పోలీస్ అవగాహన శిబిరం పల్లె నిద్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 05:16 AM
179 వీక్షణలు

మర్లపాలెం గ్రామంలో పోలీస్ అవగాహన శిబిరం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన ఎస్సై డి రామకృష్ణ 

చాట్రాయి: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి. ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల ప్రకారం, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ మర్లపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులకు రోడ్డు, సైబర్, వేసవి భద్రతలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలు కేవలం అజాగ్రత్త వల్లే జరుగుతాయని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ తలకు వచ్చే గాయాల నుండి 80% రక్షణ ఇస్తుందని వేగం కన్నా ప్రాణం ముఖ్యమని నిర్ణీత వేగ పరిమితిని పాటించాలని చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని. ఇచ్చినట్లయితే తల్లి-దండ్రులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

సైబర్ మోసంపై కూడా అవగాహన కల్పించారు. “నేరగాళ్లు ఇంటికి రాకుండా ఫోన్, వాట్సాప్, మెసేజ్ ల ద్వారా మోసం చేస్తారని ఓటిపి, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయండి” అని సూచించారు.

నూతన శిక్షా చట్టాలపై గ్రామస్తులకు వివరాలు అందజేశారు. “నేరస్తులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాలు రూపొందించబడ్డాయని ప్రతి వ్యక్తి భద్రత కోసం జాగ్రత్తలు పాటించాలి” అని స్పష్టతనిచ్చారు.

వేసవి జాగ్రత్తల విషయంలో, చాట్రాయి ఎస్ఐ సూచించారు, “పిల్లలు వేసవి సెలవుల్లో చెరువులు, కాలువలు, బావుల వద్ద ఈతకు వెళ్లకూడదని, పెద్దల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని మధ్యాహ్నం వేళల్లో ఎండలో పంపకూడదని తగినంత నీరు తాగించేలా చూసుకోవాలని 

గ్రామీణ భద్రత కోసం, “జూదం, గంజాయి, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతాము” అని హామీ ఇచ్చారు.

చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ , “పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ మీ రక్షణ కోసం సిద్ధంగా ఉందని గ్రామస్తులకు చట్టాలపై అవగాహన పెంచి, పోలీసులకు సహకరించి మర్లపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు 

ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తుల భద్రత, రోడ్డు, సైబర్, వేసవి జాగ్రత్తలు, పిల్లల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. పోలీస్ యంత్రాంగం గ్రామాన్ని సురక్షిత, చట్టపరమైన, ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కట్టుబడి ఉంది.