BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 05:03 pm
Posted by : కూనురు మధు

మరో ఉద్యమానికి మాదిగలు సిద్ధం కావాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Aug, 2026 - 05:03 PM
94 వీక్షణలు

మరో ఉద్యమానికి మాదిగలు సిద్ధం కావాలి

అసమానతలు, వివక్షత, అణిచివేత లేని సమాజ నిర్మాణం కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టబోయే మరో ఉద్యమానికి మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్  పిలుపునిచ్చారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొలిమేర దశరథ అధ్యక్షతన నూతన గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడి శంకర్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలు ఇప్పటికీ అసమానతలు, అవమానాలు, అణిచివేత, వివక్షకు గురవుతున్నారని అన్నారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు జరగబోయే పోరాటంలో చిన్నకాపర్తి గ్రామానికి చెందిన మాదిగ యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మార్పీఎస్ చిన్నకాపర్తి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా వలిగొండ సురేష్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు ఎర్రసాని గోపాల్ మాదిగ, మేడి కృష్ణ మాదిగ, మంకాల శ్రీను మాదిగ, వలిగొండ రామచందర్ మాదిగ, పెరిక ఈశ్వరయ్య మాదిగ, పెరుక సోమయ్య మాదిగ, వలిగొండ సత్యనారాయణ మాదిగ, పెరిక రాజు మాదిగ, హెచ్. స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు.