BREAKING
వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర
Date of Publish : 22 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముఖం ముందే ధర్మేంద్ర ప్రధాన్‌పై రేణుకా చౌదరి విమర్శలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 06:41 AM
67 వీక్షణలు

ముఖం ముందే ధర్మేంద్ర ప్రధాన్‌పై రేణుకా చౌదరి విమర్శలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎదుట కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, రైతుల సమస్యలు, ఇటీవల జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలోనే రేణుకా చౌదరి గట్టిగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా "యూజ్‌లెస్ ఫెలోస్" అంటూ వ్యాఖ్యానించారు. రేణుకా చౌదరి విమర్శలు కొనసాగుతుండగా ధర్మేంద్ర ప్రధాన్ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆమె మెట్లు దిగుతూ కూడా తన విమర్శలను కొనసాగించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.