BREAKING
thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముస్తఫావలీ ఆవులియా 61వ ఉరుసు మహోత్సవాలకు మంత్రి ఫరూక్‌కు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
71 వీక్షణలు

ఈ నెల 27, 28 తేదీల్లో ఘనంగా ఉరుసు వేడుకలు

విజయవాడ:

ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదాలోని హజరత్ సయ్యద్ ముస్తఫావలీ ఆవులియా 61వ ఉరుసు మహోత్సవాలు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ ఉరుసు మహోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్‌కు దర్గా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ బాబా, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూఖ్ షుబ్లీతో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఉరుసు వేడుకల వివరాలను వివరించారు.

ఈ సందర్భంగా సయ్యద్ నజీరుద్దీన్ బాబా ఉరుసు నిర్వహణ ఏర్పాట్లను మంత్రికి వివరించారు. ఆగస్టు 27వ తేదీ గురువారం రాత్రి 10 గంటలకు ముజావర్ల ఇంటి నుంచి ఉరుసు (సందల్) ఊరేగింపు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ శుక్రవారం ఉదయం 4 గంటలకు దర్గాకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం మీలాద్ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్తఫా దర్గా ముజావర్లు చీమలపాడు వలియ్యుల్లాహ్ షాహ్ ముస్తఫా, మహిబుల్లా, మతిన్ మక్బూల్‌తో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.