BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 28 February 2026, 12:41 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు

తెలంగాణ
28 Feb, 2026 - 12:41 PM
250 వీక్షణలు
బేడ బుడగ జంగాల సంక్షేమానికి చర్యలు: మంత్రి ఎన్ఎండి ఫరూక్ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కుల ధృవీకరణ పత్రాల సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ నంద్యాల, ఫిబ్రవరి 28: బేడ బుడగ జంగాల సామాజిక వర్గ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో పర్యటించిన సందర్భంగా బేడ బుడగ జంగాల సామాజిక వర్గ ప్రతినిధులు మంత్రి ఫరూక్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రతినిధులు మాట్లాడుతూ కుల ధృవీకరణ పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే జాబితాలో పేరు లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. తమ వర్గాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చాలని కోరారు. అదేవిధంగా 14వ వార్డులోని బేడ బుడగ జంగాల కాలనీలో డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టాలని, స్థానిక రామాలయ అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రంలో కోరారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందిస్తూ, బేడ బుడగ జంగాల కుల ధృవీకరణ పత్రాల అంశాన్ని మరియు ఎస్టీ జాబితాలో చేర్చే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని, రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల ప్రతినిధులు తాటికొండ బుగ్గ రాముడు, సుధాకర్, అంకాలు, మహేష్ పాల్గొన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, జిల్లెల్ల శ్రీరాములు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, అడ్వకేట్ ఖలీల్, జైలాన్, ఎంబిటీ బాబు, కామిని మల్లికార్జున, ఎబినేజర్, నాగేశ్వరరావు, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా), వేణు, సాయిరాం, వాకా వర ప్రసాద్, వేద సాయి, ఉప్పరి సురేష్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, పసుపులేటి నారాయణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. #Nandyal #NMDFarooq #CommunityIssues #CasteCertificate #PublicGrievance #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube