BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 03:33 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
03 Jun, 2026 - 03:33 PM
127 వీక్షణలు

మియాపూర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తేలింది

నాదెండ్ల, ఎన్‌టుడే న్యూస్ – చిలకలూరిపేట:

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడన్న వార్త సోమవారం రాత్రి కలకలం రేపింది. అయితే అనంతరం అతడిని హైదరాబాద్ మియాపూర్ పోలీసులు ఓ దొంగతనం కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కనపర్రు గ్రామానికి చెందిన వైసీపీ చిలకలూరిపేట నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి శ్రీనివాసరావు తమ్ముడు రవి కుమారుడు వేణు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అతనికి నాదెండ్ల మండలం సాతులూరు ఎస్సీ కాలనీకి చెందిన ఆమరలపూడి సాగర్‌తో గత నాలుగు సంవత్సరాలుగా స్నేహం ఉంది. ఈ క్రమంలో వేణు తరచూ సాగర్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.

సోమవారం నరసరావుపేటలో వైసీపీ ఆధ్వర్యంలో డీఎస్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వేణు, అనంతరం సాతులూరులోని సాగర్ ఇంటికి వెళ్లాడు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో వేణు, సాగర్ బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న వెంటనే ఓ వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు తమను పోలీసులు అని చెప్పి వేణును బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.

వచ్చిన వ్యక్తులు ఏ పోలీస్ స్టేషన్‌కు చెందినవారో, ఏ కేసు విషయమై తీసుకెళ్తున్నారో వివరాలు చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వేణు కిడ్నాప్‌కు గురయ్యాడని భావించారు. వేణు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సమయంలో నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేయించారు.

మంగళవారం నాదెండ్ల పోలీస్ స్టేషన్ ట్రైనీ ఐపీఎస్ జాతరపు నిరంజన్ మహేందర్ సింగ్, ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి సాతులూరుకు చేరుకుని సాగర్, అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించేందుకు సిద్ధమవుతుండగా, హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం అందింది.

మియాపూర్ పోలీసుల సమాచారం ప్రకారం, హైదరాబాద్ చందానగర్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో రూ.20 లక్షల నగదు చోరీకి సంబంధించిన కేసులో వేణు పేరును అనుమానితుడిగా గుర్తించారు. ఈ కేసులో వేణు గతంలో అక్కడ మరికొందరితో కలిసి నివసించినట్లు తెలిసింది. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని లొకేషన్‌ను గుర్తించిన మియాపూర్ పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు వెల్లడించారు.

దీంతో వేణు కిడ్నాప్ కాలేదని స్పష్టమవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మియాపూర్ పోలీసులు నమోదు చేసిన చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసుపై కూడా తదుపరి చర్యలు చేపడుతున్నారు.