BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 07:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాదెండ్లలో ఓటరు జాబితా సవరణపై బీఎల్ఏల అవగాహన శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 07:16 PM
117 వీక్షణలు

మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) కోసం ఓటరు జాబితా సవరణ (SIR) పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

కార్యక్రమంలో  పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు ఓటరు జాబితా సవరణలో కీ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉన్నట్లు విడదల రజిని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, తప్పులు ఉన్న చోట సవరణలు చేయడం, కొత్త ఓటర్లను జతచేయడం, అలాగే అనర్హుల పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

వీటితోపాటు, ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం అని, ప్రతి ఓటరు తన హక్కు వినియోగించుకునేలా బీఎల్ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని ఆమె హైలైట్ చేశారు.

కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయ భాస్కరరెడ్డి, మండల కన్వీనర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.