BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 May 2026, 01:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాటు సారా నిర్మూలనపై నవోదయం 2.0 దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 01:52 PM
199 వీక్షణలు

నాటు సారా నిర్మూలనపై “నవోదయం 2.0” దాడులు – 50 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న “నవోదయం 2.0” కార్యక్రమంలో భాగంగా విస్తృత దాడులు నిర్వహించారు.

ఈ చర్యలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కె. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు చేపట్టారు.

ఎన్ఫోర్స్‌మెంట్ ఇన్స్పెక్టర్ పి.ఎస్.డి. భోగేశ్వరరావు ఆధ్వర్యంలో, నూజివీడు స్టేషన్ సిబ్బంది కలిసి చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో దాడులు నిర్వహించారు.

దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 50 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో పోతనపల్లి పెద్ద తండా గ్రామానికి చెందిన గుగులోతు వెంకటేష్ (తండ్రి పరశురాముడు) పై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.

నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ/విక్రయం/పట్టుబడిన కేసుల్లో చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, అలాగే బెల్లపు ఊటను కలిగి ఉన్న భూస్వాములపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సమాచారం అందించేందుకు 9440902462 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.