BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 05:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికైన పెదబాబును ఘనంగా సన్మానించిన శాసనసభ్యులు రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:28 PM
123 వీక్షణలు

చింతలపూడి వీకేఎం మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికైన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గుత్తా సాయి సత్య వరప్రసాద్ (పెదబాబు)ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పెదబాబుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాల్లో పెదబాబు అందిస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధి అవకాశాల కల్పనలో కూడా పెదబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించి, జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొని పెదబాబును అభినందించారు.