BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 05:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నవోదయం-2.0 దాడులు: చాట్రాయిలో 2 లీటర్ల నాటు సారా స్వాధీనం.. మహిళపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:27 PM
170 వీక్షణలు

ఏలూరు | NTODAY NEWS

నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నవోదయం-2.0' కార్యక్రమంలో భాగంగా చాట్రాయి మండలం పోతనపల్లి పెద్దతండా గ్రామంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ దాడుల్లో ధారావతు జ్యోతి అనే మహిళ వద్ద నుంచి 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, ఆమెపై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.

ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కే. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

అలాగే నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయాలు, నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలను కలిగి ఉన్న భూ యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నాటు సారా తయారీ లేదా అక్రమ విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉన్నవారు **ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఏ. మస్తానయ్య (9440902462)**కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.