BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి
Date of Publish : 19 May 2026, 04:47 pm
Posted by : కూనురు మధు

నీలం శేఖర్‌కు రాష్ట్ర స్థాయి 'ఎక్సలెన్సీ అవార్డు' NTODAY NEWS హైదరాబాద్

తెలంగాణ
/ హైదరాబాద్
19 May, 2026 - 04:47 PM
182 వీక్షణలు

రవీంద్రభారతిలో ఘన సన్మానం

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రగ్నిక ఫౌండేషన్’ దశమ వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త, సలహాదారుడు శ్రీ నీలం శేఖర్ రాష్ట్ర స్థాయి 'ఎక్సలెన్సీ అవార్డు'ను అందుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, త్రిపుర ప్రిన్సిపల్ సెక్రటరీ  వెంకటేశ్వర్లు, సినీ నటులు కవిత, శివపార్వతి, ప్రముఖ గాయకుడు మనో తదితరుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకొని, ఘన సన్మానం పొందారు. నీలం శేఖర్‌తో పాటు సమాజంలో విశేష సేవలు అందించిన ధూల్‌పేట్ సీఐ సైదులు గౌడ్, ది మిషన్ సెవెన్ హిల్స్ ఫౌండర్ సీఐ ఏడుకొండలు, ఉషోదయపు పల్లె ప్రకృతి ఫౌండర్ వీరశేఖర్‌లు కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.నీలం శేఖర్ గత దశాబ్ద కాలంగా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సామాజిక సంస్థలకు గౌరవ సలహాదారుడిగా, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ, నిరుద్యోగులకు మెంటార్‌షిప్ అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అక్షర, వారియర్ మన ఆపత్బంధువులు, బహుజన అక్షర చైతన్య వారధులు వంటి వివిధ సామాజిక సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. ​ఈ కార్యక్రమంలో ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, నీలం శేఖర్‌కు అవార్డు రావడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.