BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 18 March 2026, 07:10 am
Posted by : సిర మహేష్

నిరవధిక నిరాహార దీక్షలకు రజక వృత్తిదారుల సంఘం సంఘీభావం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
18 Mar, 2026 - 07:10 AM
243 వీక్షణలు

నిరవధిక నిరాహార దీక్షలకు రజక వృత్తిదారుల సంఘం సంఘీభావం

రామన్నపేట మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వంద పడకల ఆసుపత్రి కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు వివిధ వర్గాల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో రజక వృత్తిదారుల సంఘం నాయకులు, సభ్యులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటే వంద పడకల ఆసుపత్రి అత్యవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రి ఏర్పాటుకు స్పష్టమైన హామీతో పాటు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యపై జరుగుతున్న ఈ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

దీక్షలో పాల్గొంటున్న నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడిచి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవనగంటి స్వామి, జిల్లా కమిటీ మెంబెర్స్ పొన్నం ఉప్పలయ్య, వడ్లకొండ రమేష్, మండల కమిటీ సభ్యులు ఆవనగంటి నాగేష్, రజక వృత్తిదారుల సభ్యులు సిర్సానగండ్ల నర్సింహ, వడ్లకొండ పద్మ, బొడ్డుపల్లి సంధ్య, గంప పద్మ, సిర్సానగండ్ల పెద్ద నర్సమ్మ,  మండల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షలకు మద్దతు తెలిపారు.