BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 15 May 2026, 10:13 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 May, 2026 - 10:13 AM
134 వీక్షణలు

నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

 చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం ఈమెరకు స్థానిక వ్యవసాయ కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ కు వినతిపత్రం అందించారు. అనంతరం సంబంధిత ఫర్టిలైజర్ దుకాణం వద్దకు వెళ్లి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు డ్రిప్ ఎరువులో యూరియాని కల్తీ చేసి విక్రయిస్తున్నారని ఇలా చేయడం వల్ల టమాటా పంటకు వైరస్ సోకి పంట నష్టం జరిగిందన్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో భూములలో సత్సవ తగ్గి దేనికి పనికి రాకుండా పోతాయని రవి నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు, నకిలీ మందులు కల్తీ ఎరువులను విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో మండలంలోని రైతులందరం కలిసి జిల్లా స్థాయిలో అధికారులకు తమ గోడును తెలుపుతామని అన్నారు, స్పందించిన వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ సంబంధిత ఫర్టిలైజర్ దుకాణంలో తనిఖీ చేపట్టారు, నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు గోడము తనిఖీ చేసి అందులో

ఉన్న ఎరువులు అదేవిధంగా టమాటా పంటకు వేసే పలు రకాల మందులను నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపుతామని తేడా వస్తే లైసెన్సును రద్దు పరుస్తామని ఆయన అన్నారు రైతులు విత్తనాలు ఎరువులు మందులు కొనుగోలు చేస్తే దుకాణదారుల నుంచి కచ్చితంగా

బిల్లులు తీసుకోవాలని తెలిపారు వ్యవసాయ అధికారి కోరిక మేరకు రైతులు తమ ఆందోళనను విరమించారు. న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతులు పాల్గొన్నారు.