BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

​నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 May, 2026 - 04:03 PM
151 వీక్షణలు

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

​రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే లక్ష్యంతో హాజీపూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతతో పాటు స్టాక్, బిల్లులు, లాట్ నంబర్లు, ధరల పట్టికలు, లైసెన్స్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏడీఏ కృష్ణ, హాజీపూర్ తహసీల్దార్ పుష్పలత, ఏఓ కృష్ణ, పోలీసు అధికారి తిరుపతి తదితరులు PACS పద్తనపల్లి, కొమురెల్లి మల్లికార్జున ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి వ్యాపారులకు పలు సూచనలు చేశారు.

రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యత లేని, గడువు ముగిసిన, నకిలీ విత్తనాలు లేదా ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా వ్యాపారులను హెచ్చరించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వరి సన్న రకాలైన BPT 5294, తెలంగాణ సోనా RNR 15048, KNM 1638, Jai Shree Ram, HMT, WGL 962, WGL 44, JGL 1798 వంటి విత్తనాలను మాత్రమే విక్రయించాలని, దొడ్డు రకాల విత్తనాలను అమ్మరాదని అధికారులు స్పష్టం చేశారు