BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 11:46 AM
74 వీక్షణలు

నంద్యాల జిల్లా - నందికొట్కూరు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ.

నందికొట్కూరు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ.... 

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు.... 

నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడవద్దు.... 

మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణ,సాధికారిత కొరకు ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.... 

జల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS.

నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని నందికొట్కూరు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో  గౌరవంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి.

PGRS కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. 

అనంతరం CCTNS గురించి, పనితీరు, కేసుల దర్యాప్తు, పరిష్కారంలో వాటి పాత్ర పై మొదలగు వాటిపై సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు.

అనంతరం నందికొట్కూరు టౌన్ మరియు రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో గల పెండింగ్ కేసులపై క్షుణ్ణంగా రివ్యూ నిర్వహించడం జరిగింది.

కేసుల పెండింగ్ గల కారణాలపై ఆరా తీశారు. 

ప్రస్తుతం ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు అనగా దర్యాప్తు, ముద్దాయిల అరెస్టు, NBW (నాన్  బెయిలబుల్ వారెంట్) లను ఎగ్జిక్యూట్ చేయడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని  ఉపయోగించాలన్నారు.

నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించి పోలీస్ శాఖపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలి. 

సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలి.

మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణ,మహిళా సాధికారిత మొదలగు అంశాలపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం  ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలకు వివరించాలి.

మీ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాలలో ప్రజల ఐక్యత కొరకు గ్రామసభలు నిర్వహించి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ నందికొట్కూరు రూరల్ సర్కిల్ మరియు టౌన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

నందికొట్కూరు సర్కిల్ కార్యాలయం.నంద్యాల.