BREAKING
హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్
Date of Publish : 25 April 2026, 08:40 am
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాల జిల్లాలోని 73 మంది సివిల్ పోలీసులకు స్థానచలనం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 08:40 AM
248 వీక్షణలు

నంద్యాల జిల్లాలోని 73 మంది సివిల్ పోలీసులకు స్థానచలనం….జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS 

వివరాలనునంద్యాల జిల్లా

25-04-2026 

నంద్యాల జిల్లాలోని 73 మంది సివిల్ పోలీసులకు స్థానచలనం….జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ లిప్స్

నంద్యాల జిల్లాలో పోలీస్ శాఖలో సాధారణ బదిలీలలో భాగంగా ఒకే పోలీస్ స్టేషన్ లో ఐదు సంవత్సరాలకు పైబడి ఉన్న73 మంది పోలీసు సిబ్బందికి(ASI స్థాయి నుండి PC వరకు) ఈ రోజు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆద్వర్యంలో బదిలీలు చేశారు.

ఈ బదిలీల్లో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఎంత మంది వచ్చారు ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకొని వాటి ఆధారంగా బదిలీలు చేశారు.ఇందులో ASI లు 4 మంది, HC లు 4 మంది, PC లు 65 మంది ఉన్నారు.08 మంది రిక్వెస్ట్ మేరకు వారిని కూడా బదిలీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో బదిలీలు అనేవి సాధారణం. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో  పనిచేయుట మనం సిద్దంగా ఉండాలని సిబ్బందికి తెలియజేశారు.

ఈ బదిలీల కొరకు  హాజరైన పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ  స్వయంగా మాట్లాడి, వారి వ్యక్తిగత సమస్యలు, పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాలు, స్పోజ్ కోటాకు ప్రాధాన్యత కల్పించి, గతంలో వారు పనిచేసిన స్టేషన్ లు కాకుండా, వివిధ పోలీసు స్టేషనుల్లో ఏర్పడిన ఖాళీలను బదిలీలతో భర్తీ చేశారు. 

బదిలల్లో ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా,సొంత గ్రామం,మండలం మరియు ఇంతకు ముందు పనిచేసిన పోలీస్ స్టేషన్ సర్కిల్ కాకుండా వేరే సర్కిల్ లోని పోలీస్ స్టేషన్ లలో ఖాళీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా చూపించి పోలీస్ స్టేషన్ ఎంచుకోవాలని,అనారోగ్యంతో బాధపడే వారి విజ్ఞప్తి మేరకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 

పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జిల్లా ఎస్పీ వ్యవహరించి బదిలీ చేశారని ఈ బదిలీలలో పాల్గొన్న సిబ్బంది తమ సంతృప్తిని వ్యక్తపరిచారని నంద్యాల జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్ తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ తో పాటు స్పెషల్ బ్రాంచ్ DSP శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా, సూర్యమౌళి. D.P.O సూపరింటెండెంట్ ఖాదర్ వలి పాల్గొన్నారు.


జిల్లా పోలీస్ కార్యాలయం.నంద్యాల.