BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 04 April 2026, 09:26 pm
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాలలో దీపం వెలిగించి మంత్రి NMD ఫరూక్ సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:26 PM
179 వీక్షణలు

అమరావతికి చట్టబద్ధమైన భరోసా

నంద్యాలలో దీపాలు వెలిగించి మంత్రి ఎన్ఎండి ఫరూక్ సంబరాలు

నంద్యాల, ఏప్రిల్ 4:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శనివారం నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద గల తన నివాసంలో "జై అమరావతి" అంటూ మంత్రి ఫరూక్ దీపం వెలిగించి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీతో పాటు, కేంద్రంలోని ఉభయ సభలలో పునర్విభజన చట్ట సవరణ చేయడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో విశేష కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి , మరియు మంత్రి నారా లోకేష్‌ గార్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి అన్నదాతలకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల త్యాగం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతి ఇకపై కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రపంచం గర్వించదగ్గ నగరంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి ఫరూక్ ధీమా వ్యక్తం చేశారు.