BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 31 August 2026, 08:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు ఏరియా ఆసుపత్రికి ఎలక్ట్రికల్ బెడ్, వీల్‌చైర్ వితరణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:15 PM
75 వీక్షణలు

నూజివీడు ఏరియా ఆసుపత్రికి ఎలక్ట్రికల్ బెడ్, వీల్‌చైర్ వితరణ

రోగుల సౌకర్యాల కోసం కొలుసు పెద్ద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం

(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు)

నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటానని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన హామీ మేరకు నూజివీడు ఏరియా ఆసుపత్రికి ఎలక్ట్రికల్ బెడ్, ఎలక్ట్రికల్ వీల్‌చైర్‌ను వితరణగా అందించారు.

మంత్రి కొలుసు పార్థసారథి తండ్రి, మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ కొలుసు పెద్ద రెడ్డయ్య పేరుతో ఏర్పాటు చేసిన కొలుసు పెద్ద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.లక్ష విలువైన ఎలక్ట్రికల్ బెడ్, ఎలక్ట్రికల్ వీల్‌చైర్‌ను ఆసుపత్రికి అందజేశారు. వీటిని నూజివీడు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజ స్వీకరించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులోనూ ఆసుపత్రి అభివృద్ధికి, ప్రజా సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం కొనసాగిస్తామని తెలిపారు.

ఆసుపత్రికి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో రోగులకు, వారి సహాయకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి.