BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 27 August 2026, 08:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు మండలంలో పెద్దపులి కలకలం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:34 AM
170 వీక్షణలు

నూజివీడు మండలంలో పెద్దపులి కలకలం.. రంగంలోకి దిగిన అటవీశాఖ

ముక్కొల్లుపాడు గొల్లగూడెం ప్రాంతంలో పులి సంచరిస్తుందంటూ గ్రామస్తుల సమాచారం.. డ్రోన్‌తో పరిశీలన

నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గ్రామం గొల్లగూడెం ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉందంటూ వచ్చిన సమాచారంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఓ పులి రెండు పిల్లలతో కలిసి ప్రాంతంలో తిరుగుతున్నట్లు కొందరు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ రేంజర్ అధికారి సత్యనారాయణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానిత ప్రాంతాలను పరిశీలించి డ్రోన్ కెమెరాల ద్వారా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే పరిశీలనలో ఇప్పటివరకు ఎలాంటి పులి ఆనవాళ్లు, పాదముద్రలు లేదా కదలికలు గుర్తించలేదని రేంజర్ అధికారి తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మి భయాందోళనకు గురికావద్దని సూచించారు.

ఎవరైనా నిజంగా పులి సంచారాన్ని గమనించినా, జాడలు కనిపించినా వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ అధికారి సత్యనారాయణ హెచ్చరించారు.