BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 27 August 2026, 09:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా రక్తదాన శిబిరం..

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:05 AM
58 వీక్షణలు

మధిరలో మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా రక్తదాన శిబిరం.. తలసేమియా చిన్నారులకు అండగా నిలిచిన ముస్లిం ఐక్య సంఘం

రక్తదానంతో తలసేమియా బాధితులకు పునర్జన్మ : మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత

మానవత్వ సేవలకు ప్రతీకగా ఉచిత రక్తదాన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సామినేని సుజాత మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా చిన్నారులకు రక్తదానం చేయడం ద్వారా వారికి పునర్జన్మ అందించినట్లేనని అన్నారు. మానవత్వానికి మించిన సేవ మరొకటి లేదని, రక్తదానం ద్వారా ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.

మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని, ఆత్మీయ తృప్తిని కలిగించిందన్నారు. ప్రవక్త బోధించిన ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ప్రవక్త ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం నాయకులు చేపట్టిన రక్తదాన శిబిరం అభినందనీయమన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్‌లు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని ప్రశంసించారు.

ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను చైర్‌పర్సన్ ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు.

ముజాహిద్, హుస్సేన్‌లు కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజంలో అవసరమైన చోట అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఖమ్మం జిల్లా పరిధిలోని ముష్టికుంట, ఎర్రుపాలెం, దెందుకూరు తదితర ప్రాంతాల్లో మసీదుల నిర్మాణాలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.

కులమతాలకు అతీతంగా మానవత్వమే లక్ష్యంగా కొనసాగుతున్న ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినం సందర్భంగా అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు.