BREAKING
thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి
Date of Publish : 27 August 2026, 08:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో కేబుల్ ఆపరేటర్లతో విద్యుత్ శాఖ కీలక సమావేశం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:41 AM
78 వీక్షణలు

మధిరలో కేబుల్ ఆపరేటర్లతో విద్యుత్ శాఖ కీలక సమావేశం

అండర్ గ్రౌండ్ విద్యుత్ పనుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నెట్, సిటీ కేబుల్ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుధవారం మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏడీఈ ఎం. అనురాధ అధ్యక్షత వహించారు.

మధిర పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా అందించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఏడీఈ తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభాలను దశలవారీగా తొలగించనున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం పట్టణంలో ఇంటర్నెట్ కేబుల్స్, సిటీ కేబుల్స్ విద్యుత్ స్తంభాలను ఆధారంగా చేసుకొని ప్రజలకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాల తొలగింపు నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు పూర్తయిన వెంటనే యూజీ కేబుల్ వ్యవస్థ ద్వారా వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఏడీఈ అనురాధ వెల్లడించారు.

ఈ సమావేశంలో మధిర పట్టణ విద్యుత్ శాఖ ఏఈ ఎస్. అనిల్ కుమార్, పట్టణంలోని ఇంటర్నెట్ మరియు సిటీ కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.