BREAKING
thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి
Date of Publish : 27 August 2026, 09:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:06 AM
48 వీక్షణలు

తిరువూరులో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం.. స్థానిక ఎన్నికలపై వ్యూహ రచన

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు:

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన అంశంగా చేసుకుని బహుజన్ సమాజ్ పార్టీ తిరువూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షులు ప్రత్తిపాటి మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు, రాష్ట్ర కార్యదర్శులు శామ్యూల్ కుమార్, గంగవరపు దేవా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారికి మద్దతుగా నిలిచే నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని సూచించారు.

తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యదర్శి గంగవరపు దేవా మాట్లాడుతూ క్రైస్తవులు, పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వారి సమస్యల పరిష్కారానికి బీఎస్పీ అండగా ఉంటుందని తెలిపారు.

జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పార్టీ ఏ ఒక్కరి కృషితో ముందుకు సాగదని, ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా తంగెళ్లబీడు గ్రామానికి చెందిన ముస్లిం నాయకుడు షేక్ రసూల్‌కు పార్టీ కండువా కప్పి బీఎస్పీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏ.కొండూరు అధ్యక్షులు నాగరాజు, గంపలగూడెం అధ్యక్షులు వెంకట్రావు, కోటేశ్వరరావు, రసూల్, కుమారి, ఏసుపాదం, సురేష్, వెంకటేశ్వరరావు, రావూరి రమేష్, ఆదూరి కోటయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

చివరగా నియోజకవర్గ అధ్యక్షులు ప్రత్తిపాటి మల్లయ్య వందన సమర్పణతో సమావేశం ముగిసింది.