BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 27 August 2026, 09:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేపాల్‌లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ బీభత్సం.. 160 మంది మృతి..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:16 AM
67 వీక్షణలు

నేపాల్‌లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

భోటేకోశీ నది ఉగ్రరూపం.. నేపాల్–టిబెట్ సరిహద్దు నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం

కొట్టుకుపోయిన గ్రామాలు.. ధ్వంసమైన వంతెనలు, రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు

గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు.. కైలాస్ మానస సరోవర యాత్రికులపై ఆందోళన

కాఠ్మాండు, ఆగస్టు 27:

నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం ఉత్తర నేపాల్ జిల్లాలను అతలాకుతలం చేసింది. భోటేకోశీ నది ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ విపత్తులో నేపాల్‌లో 157 మంది, టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 160కి చేరింది.

బుధవారం ఉదయం భోటేకోశీ నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం ప్రారంభమైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, భారీగా మట్టి, రాళ్ల ప్రవాహం రావడంతో ల్హెండే నది ఉద్ధృతమై భోటేకోశీలో కలిసినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ భారీ వర్షాల వల్ల కాకుండా ఆకస్మిక ప్రకృతి విపత్తు కారణంగానే ఈ వరదలు సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిన వసతులు

వరదల ధాటికి ఇళ్లు, వాహనాలు, వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రసువా జిల్లా తీవ్రంగా ప్రభావితమవగా.. నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ జిల్లాల్లోనూ భారీ నష్టం వాటిల్లింది. ఆరు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

గల్లంతైన వారిలో భారతీయులు

నేపాల్ పర్యాటక శాఖ ప్రాథమిక నివేదిక ప్రకారం 384 మంది గల్లంతైనట్లు సమాచారం. వీరిలో విదేశీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉన్నట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. వీరిలో కొంతమంది కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లిన యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 37 మంది ఎన్నారైలు కూడా వరదల్లో గల్లంతైనట్లు సమాచారం.

రంగంలోకి సహాయక బృందాలు

గల్లంతైన వారి కోసం నేపాల్ సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

భోటేకోశీ, త్రిశూలి నదుల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ కోసం భారత ప్రభుత్వం నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తోంది. గాలింపు చర్యలు పూర్తయిన తర్వాత మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.