BREAKING
నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!!
Date of Publish : 24 April 2026, 07:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు నవోదయం–2.0 కార్యక్రమం కింద పాత నేరస్తులపై బైండ్ ఓవర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Apr, 2026 - 07:23 PM
177 వీక్షణలు

నూజివీడు: నవోదయం–2.0 కార్యక్రమం కింద పాత నేరస్తులపై బైండ్ ఓవర్

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్  బి. శ్రీలత, ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్  నాగ ప్రభు కుమార్ మరియు ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు, నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు (08) మందిని నూజివీడు తహసిల్దార్ (మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్) ఎదుట హాజరుపరచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్వో, ఈ బైండ్ ఓవర్ ఒక (01) సంవత్సరం కాల పరిమితి కలిగి ఉంటుందని, ఈ కాలవ్యధిలో మరల ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తుల నుండి లక్ష రూపాయలు (రూ.1,00,000/-) జరిమానా విధించబడతాయని మరియు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని పాత నేరస్తులను హెచ్చరించారు. నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారి పైన నాటు సారాయి తయారుచేసిన అమ్మిన కలిగి ఉన్న నేరమని నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సప్లై చేసే వ్యాపారుల పైన మరియు నాటు సారా తయారీ ఉపయోగించే బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానుల పైన కూడా కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు.