BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 23 March 2026, 11:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో బాలుర వసతి గృహానికి పోలీసుల ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:12 PM
186 వీక్షణలు

నూజివీడులో బాలుర వసతి గృహానికి పోలీసుల ఆకస్మిక తనిఖీ

ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని నూజివీడు డీఎస్పీ కె.వి.వి.యన్.వి. ప్రసాద్, పట్టణ సీఐ సత్యశ్రీనివాస్, ఎస్సై కె. నాగేశ్వరరావు లు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.

వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థులతో మాట్లాడి, హాస్టల్‌లో ఉన్న సదుపాయాలు, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుకుంటూ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా సిగరెట్లు, మద్యం, గంజాయి వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఏదైనా సమస్యలు తలెత్తినపుడు వెంటనే పట్టణ సీఐ సత్యశ్రీనివాస్ (ఫోన్: 8977917599), డీఎస్పీ కె.వి.వి.యన్.వి. ప్రసాద్ (ఫోన్: 9440796408) ను సంప్రదించాలని కోరారు.