BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 25 April 2026, 05:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 05:47 PM
156 వీక్షణలు

నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ చర్యలు

ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆధ్వర్యంలో నవోదయం-2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా, నేరాలకు పాల్పడిన 04 మంది పాత నేరస్తులను అగిరిపల్లి తహసిల్దార్ ఎదుట హాజరుపరచి, వారికి ఒక సంవత్సర కాల పరిమితి ఉన్న బైండ్ ఓవర్ జారీ చేయడమైంది. ఈ సమయంలో, నేరాలకు మళ్లీ పాల్పడితే, 1,00,000/- రూపాయలు జరిమానా విధించబడుతుందని మరియు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని హెచ్చరించారు.

పాత నేరస్తుల వివరాలు:

పెనుముచ్చు సురేంద్ర బాబు – తండ్రి: వీర రాఘవులు (ఈదులగూడెం గ్రామం)

మాటూరి నాగ మురళి మోహన రావు – తండ్రి: గోపాల కృష్ణ మూర్తి (నెక్కలం గొల్లగూడెం)

రాజులపాటి శ్రీనివాస రావు @ ఠాగూరు – తండ్రి: సత్యనారాయణ (చిన్న అగిరిపల్లి)

బెజవాడ సాంబశివ రాయు – తండ్రి: రెడ్డయ్య (ఈదర గ్రామం)

అంతేకాక, బెల్ట్ షాపులు నిర్వహించే వారు, నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, మరియు నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లపు ఊట కలిగిన భూయజమానులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.