BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 14 June 2026, 08:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం PGRS సందర్భంలో జరిగిన ఘటనపై టీడీపీ సీనియర్ నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
217 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురంలో ఇటీవల కలెక్టర్ PGRS కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటనపై టీడీపీ సీనియర్ నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు స్పందించారు. “పిలవని పేరంటం, వెయ్యని విస్తరాకు” అనే సామెతను ఉదాహరణగా చూపుతూ కొలికపూడి కార్యక్రమానికి హాజరై, తనకు ముందుగా సమాచారం లేకపోయినా స్కూల్ పిల్లలతో పాటు పూలు చల్లే కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సమయంలో తనపై కూడా పూలు చల్లిన ఘటనను మీడియా పెద్దగా వైరల్ చేసిందని పేర్కొన్నారు.

సభా గౌరవం కోసం ఆయనకు కూడా సన్మానం చేశామని, అయితే ముందుగా సమాచారం ఇవ్వలేదని, ఆహ్వానం లేకుండానే హాజరయ్యారని వ్యాఖ్యానించారు. దీనిని ఆయనకు అర్థం కావడం లేదని, ఇక అర్థం అయ్యే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు.

అలాగే నరసాపురం గురుకుల పాఠశాల కోసం తన వ్యక్తిగతంగా 23 ఎకరాల భూమి విక్రయించి, ఊరికి దగ్గరగా 10 ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. భవనం నిర్మాణం పూర్తయ్యే సమయంలో ప్రభుత్వం మారడంతో ప్రారంభోత్సవంలో స్థలదాతగా తన పేరు లేకపోయినా, వచ్చిన మంత్రులు కొనేరు రంగారావు, దివాకర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సుధారాణి వంటి వారికి సన్మానం జరిగిందని తెలిపారు.

ఇక విస్సన్నపేట మండల పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం విషయంలో ఎంపీ వద్దకు వెళ్లినప్పుడు ముందుగా ఎమ్మెల్యే వద్ద డేట్ తీసుకోవాలని సూచించారని, ఎమ్మెల్యే మాత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడు రఘురామ్ ఆహ్వానిస్తేనే వస్తానని చెప్పినట్లు వివరించారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో తాము పెద్దగా పట్టించుకోలేదని, కానీ అప్పటి నుంచి ఆయన కార్యాలయానికి రాలేదని వ్యాఖ్యానించారు.

తనకు నరసాపురంలో జరిగిన అవమానాలు కొత్తేమీ కాదని, అయినా పార్టీ పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు.