BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 08:20 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 08:20 PM
88 వీక్షణలు

నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు...

  • ప్రయాణికుల ప్రాథమిక అవసరాలు కల్పించడంలో అధికారుల విఫలం.,..
  • నత్త నడకలా నడుస్తున్న అభివృద్ధి పనులు 
  • ప్లాట్ ఫామ్ నంబర్ 2లో ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించని రైల్వే శాఖ...
  • రేపు నరసరావుపేటకు డిఆర్సి అధికారులు రాక...


 నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట రైల్వే స్టేషన్లో కనీస మౌలిక వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అమృత పథకంలో అభివృద్ధి పనులు జరుగుతున్న అవి నత్తనడకల కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్ కు వచ్చి పోయే రహదారి అసంపూర్తిగా ఉంది. దీనికి తోడు ఇరువైపులా పిచ్చి మొక్కల పెరిగి విషపురుగులు పాములు సంచరించే అవకాశం ఉంది ప్రయాణికులు వాటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది సరైన లైటింగ్స్ సౌకర్యం లేదు. అలానే ప్లాట్ఫారం నెంబర్ 1 లో సదుపాయాలు ఉన్నప్పటికీ బాత్రూములు అపరిశుభ్రంగాను నీటి సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు తాగేందుకు మంచినీరు సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. అలానే ప్లాట్ఫారం నెంబర్ 2లో ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫారం దాటి భోగీలు ముందువైపుకు వెళ్తున్నాయి అక్కడ ఉన్న ప్లాట్ ఫామ్ ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందిగా మారింది రాత్రిపూట మరింతగా ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడే ఉండే ఆర్పిఎఫ్ పోలీసులు టార్చి లైట్లు మొబైల్ లైట్లు వేసి ప్రయాణికులను రైలెక్కిస్తున్నారు. భోగిలను నిలుపుదల చేసే సూచికల బోర్డులు ఏర్పాటు చేయలేదు ఏ భోగి ఎక్కడ ఆగుతుందో తెలియక ట్రైన్ ఆగే ఒక్క నిమిషంలో వాటిని గుర్తించి ఎక్కేలోపు ట్రైన్ కదిలిపోయి ఎక్కకుండా అలానే ఉండిపోయిన ప్రయాణికులు ఎంతోమంది ఉన్నారు ఒక్కొక్కసారి ట్రైన్ చైన్ లాగి నిలుపుదల చేస్తున్నారు. ఇటీవల నరసరావుపేట నుంచి తిరుపతి ట్రైన్ కు రద్దీ బాగా పెరిగింది మిగతా ప్రాంతాలైన బెంగళూరు ధర్మవరం వైజాగ్ గోవా హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేందుకు కూడా సదుపాయం కల్పించడంతో ప్రయాణికులు తాకిడి బాగా పెరిగింది. వసతుల ఏర్పాట్లు అధికారులు విఫలమవుతున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా త్వరితగతిన తగిన ఏర్పాట్లు ప్రాథమిక అవసరాలు కల్పించాలని ప్రయాణికులు మరిమరి కోరుతున్నారు.

అలానే ఆకుతాయులకు నరసరావుపేట రైల్వే స్టేషన్ అడ్డాగా మారిందని ప్రయాణికులు చెబుతున్నారు. 

కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు  గంజాయి, మద్యం మత్తులో సంచరిస్తూ ఉండటంతో మహిళలు ముఖ్యంగా భయపడుతున్నారు అలానే కొంతమంది ట్రాన్స్ జెండర్స్ నుంచి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెళ్లాలంటే భయమేస్తుంది అని కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు పర్యవేక్షణ మరింతగా పెంచాలని అనుమానితులను ఆకతాయిలను రైల్వే స్టేషన్ లోకి రానివ్వకుండా నిలువరించాలని దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.