BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 09:00 pm
Posted by : V శ్రీనివాస్

​నస్పూర్ లో వైభవంగా వారాహి నవరాత్రులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:00 PM
61 వీక్షణలు

​నస్పూర్ లో వైభవంగా వారాహి నవరాత్రులు: హోమంలో పాల్గొన్న మేయర్ దంపతులు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ కాలనీలో గల శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గా దేవి దేవాలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమంలో మున్సిపల్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ - సుజాత దంపతులు, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం. శ్రీనివాస్ దంపతులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, యాగశాలలో జరిగిన హోమంలో పూర్ణాహుతి సమర్పించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ వారాహి అమ్మవారిని వారు ప్రార్థించారు.

​పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు మేయర్, జీఎం దంపతులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు