BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 11 June 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నవధాన్యాల సాగు ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతోంది జి శ్రీనివాస రావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:04 AM
210 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, తాతకుంట్ల యూనిట్‌లో గంగుల గోపి యజమాని ఇంటివద్ద బయో రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నవధాన్యాల సాగు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 30 రకాల విత్తనాలను విత్తన కిట్లుగా తయారు చేశారు.

ఎల్-నీనో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని, ఈ నవధాన్యాల సాగు ద్వారా మొక్కలు వాతావరణంలో లభించే నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ స్థూల పోషకాలను గ్రహించి, వాటిని వేర్ల ద్వారా భూమికి అందించగలవు. పి.యం.డీ.ఎస్. సాయంతో కలుపు నివారణ జరుగుతుంది.

భూమి గుల్ల భారడం, సేంద్రీయ కర్బన్ శాతం పెరగడం వంటి లాభాలు సాధ్యమవుతున్నాయి. తద్వారా భూమి సుపోషకం అవుతుంది, వానపాములు, మైక్రోజీవులు, మిత్రకీటకాలు వంటి జీవరాసులు పెరుగుతూ పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

అతివృష్ఠి లేదా అనావృష్ఠి పరిస్థితులను తట్టుకొని, నవధాన్యాలను విత్తన గుళికలుగా మార్చి వేసే విధానం ద్వారా తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో కూడా మొలకలు వస్తాయి. ఇవి పశుగ్రాసానికి ఉపయోగపడతాయి. పాలు, వెన్న శాతం పెరగడం వల్ల రైతులకు మరింత ఆదాయం సమకూరుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది జి. శ్రీనివాస్ రావు (FMT), VHA భూక్యా మంగమ్మ, ICRP లు వి. విజయలక్ష్మి, బి. వెంకట నాగలక్ష్మి, పి. అంజి బాబు, జి. భారతి, బి. శాంతి తదితరులు పాల్గొన్నారు