BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు

తెలంగాణ
30 Dec, 2025 - 10:43 AM
313 వీక్షణలు

నూతన సంవత్సర వేడుకలు మద్యంతో వద్దు

NTODAY NEWS: కాకినాడ జిల్లా – గొల్లప్రోలు ప్రతినిధి  బోరా శివారెడ్డి మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ ఎన్. సూర్యనారాయణ పిలుపునిచ్చారు.మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారం గొల్లప్రోలు పట్టణంలో జన విజ్ఞాన వేదిక మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా “మద్యం వద్దు”, “గంజాయి వద్దు”, “తాగొద్దు నాన్నలు–అన్నయ్యలు” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు వికలాంగులుగా మారుతున్నారని తెలిపారు. మద్యం కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, ఒకరి నిర్లక్ష్యం వల్ల మరో కుటుంబానికి తీరని నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యం ను ఆదాయ వనరుగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ఆడప వెంకటరావు, లెక్చరర్లు కె.వి. సర్వేశ్వరరావు, జి. విశ్వ వీరస్వామి, జి. విజయ్ కుమార్, జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు ఏలేటి నాని బాబు, తాతపూడి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube